TooBrief TooBrief

Home / Headlines

RRB రైల్వేలో 4,029 ఉద్యోగాలు.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న దరఖాస్తు గడువు!

TV9 Telugu · Jobs · 2026-09-13

RRB రైల్వేలో 4,029 ఉద్యోగాలు.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న దరఖాస్తు గడువు!

హైదరాబాద్, సెప్టెంబర్ 13: భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక సమాచారం. జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసిన CEN No. 04/2026 నోటిఫికేషన్‌కు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు మరికొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ RRBలు, రైల్వే జోన్లు, ప్రొడక్షన్ యూనిట్ల పరిధిలో మొత్తం 4,029 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సికింద్రాబాద్ రైల్వే జోన్‌కు 111 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Read original on TV9 Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs