TooBrief TooBrief

Home / Headlines

Andhra News: సైన్సా? దైవ రహస్యమా? అద్దంకి వెయ్యి స్తంభాల గుడిలో అద్భుత ఘట్టం

TV9 Telugu · DistrictNews · 2026-09-28

Andhra News: సైన్సా? దైవ రహస్యమా? అద్దంకి వెయ్యి స్తంభాల గుడిలో అద్భుత ఘట్టం

ప్రకాశం జిల్లా అద్దంకిలో ఒక అరుదైన, అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. చీకటి చీల్చుకుంటూ గర్భగుడిలోకి వచ్చిన లేలేత సూర్యకిరణాలు నేరుగా మూలవిరాట్‌పై పడి బంగారు కాంతులతో మెరిసిపోయాయి. పట్టణంలోని వెయ్యి స్తంభాల గుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ గంగా వింధ్యవాసిని సమేత నగేశ్వర స్వామివారి ఆలయం ఈ అద్భుత దృశ్యానికి వేదికైంది. గర్భగుడిలోని పరమశివుడిని ఆదిత్యుడు ప్రత్యక్షంగా పూజించాడు. నగేశ్వరుడి లింగాకృతిపై భానుడి కిరణాలు పడిన ఈ దృశ్యం చూస్తే.. సూర్యుడే మొదటి పూజారిగా మారినట్లుగా సాక్షాత్కరించింది. అయితే, ఇది సైన్సా? దైవ రహస్యమా? లేక ప్రాచీన శిల్పకళా వైభవమా? అనే చర్చకు దారితీసింది.

Read original on TV9 Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs