NTV Telugu · DistrictNews · 2026-10-01
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
నేపాల్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. విదేశీ పర్వతారోహకుల కోసం హిమాలయాల్లో బేస్ క్యాంప్‌ను సిద్ధం చేస్తున్న నేపాలీ కార్మికులపై భారీ హిమపాతం విరుచుకుపడింది. ఈ ఘటనలో 15 మంది కార్మికులు మృతి చెందారు. మరో వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ నెలతో ముగియనున్న శరదృతువు పర్వతారోహణ సీజన్‌లో చోటుచేసుకున్న అత్యంత ప్రాణాంతక ఘటనగా అధికారులు పేర్కొన్నారు. ఉత్తర నేపాల్‌లోని మానాంగ్ జిల్లాలో 7,126 మీటర్ల (23,379 అడుగుల) ఎత్తైన హిమ్‌లుంగ్ హిమాల్ పర్వతం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. విదేశీ పర్వతారోహకులు శిఖరాన్ని అధిరోహించేందుకు అవసరమైన బేస్ క్యాంప్‌ను సిద్ధం చేసేందుకు నేపాలీ కార్మికులు అక్కడ టెంట్లు ఏర్పాటు చేస్తుండగా… తాళ్లు బిగిస్తుండగా వారిపై హిమపాతం విరుచుకుపడింది.
Read original on NTV Telugu Get the app
Licensed summary · LicensedSummary
Related briefs
- PNGRB , Oil Ministry launch drive targeting 50 lakh D - PNG connections by
- Congress Takes Out Rally Over Irrigation And Power Issues In Dahi
- Parul University held the fourth edition of its flagship legal conclave
- KTF 2026 concludes on a high note , turning the Eastern Himalayas into Culture
- Fixed income gains favour with India fund managers as rate cycle shifts